మద్దతు ధర లేక టమాట రైతుల ఆందోళన - కృష్ణా జిల్లాలో టమాటా రైతుల కష్టాలు
కృష్ణా జిల్లాలో టమాట పండించే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కష్టపడి సాగుచేసినా మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా నూజివీడు మండలంలో టమాట రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నూజివీడు డివిజన్లో అధికంగా టమాట సాగుచేశారు. రైతుల కష్టానికి ఫలితంగా చెప్పుకోదగ్గ స్థాయిలో దిగుబడి వచ్చింది. ఆ రైతుల ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కిలోకు కేవలం రూ.5 మాత్రమే ధర పలుకుతోంది. 25 కిలోల టమాట పెట్టె 130 రూపాయలకే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుబజారులో కాస్త ఎక్కువ ధవ ఉన్నా... అక్కడ నేరుగా విక్రయించే పరిస్థితి లేదని అన్నదాతలు చెబుతున్నారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని టమాట రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.