కృష్ణాజిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో శ్రీ గోదా, రాజ్యలక్ష్మి సమేత శ్రీ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శయన ఏకాదశి సందర్భంగా శ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో... స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు లేకుండా స్వామివారికి నిరాడంబరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీమన్నారాయణస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు - tholi ekadashi news in krishna
తొలి ఏకాదశి వేడుకలను కృష్ణా జిల్లా ఉల్లిపాలెంలో నిరాడంబరంగా నిర్వహించారు. శ్రీ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
![శ్రీమన్నారాయణస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు toli ekadashi celebrations at vullipalen in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7849479-95-7849479-1593610682875.jpg)
శ్రీమన్నారాయణస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి వేడుకలు