ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలాల్లో ఏముందంటే... - Horoscope Today : ఈ రోజు మీ రాసి ఫలాల్లో ఏముందంటే...

ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today : ఈ రోజు మీ రాసి ఫలాల్లో ఏముందంటే...
Horoscope Today : ఈ రోజు మీ రాసి ఫలాల్లో ఏముందంటే...

By

Published : May 30, 2021, 4:34 AM IST

Updated : May 30, 2021, 7:39 AM IST

ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో విజయం సొంతమవుతుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఇంటగెలిచి రచ్చగెలుస్తారు. చంద్ర గ్రహ అష్టోత్తరం పఠిస్తే మంచిది.

శ్రమతోకూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగు ముందుకు వేయండి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆరోగ్యం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి

మంచి సమయం. కీలకమైన పనుల్లో తోటివారి సహకారం లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సూర్యాష్టకము చదివితే బాగుంటుంది.

మీ మీ రంగాల్లో శుభఫలితాలు అందుకుంటారు. సమయం అనుకూలంగా ఉండడం వల్ల పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. గణపతి స్తోత్రం చదవితే మంచి జరుగుతుంది.

కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. తీసుకునే నిర్ణయాల్లో స్తిరత్వం ఉండదు. శని శ్లోకం పఠిస్తే మేలు జరుగుతుంది.

మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఆర్థికపరంగా మేలు జరుగుతుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధనా శుభప్రదం.

ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.


ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

ఇవీ చూడండి:

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు : వాతావరణ శాఖ

Last Updated : May 30, 2021, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details