Todays Horoscope : మీ రాశి ఫలాల్లో ఏముందో తెలుసుకోండి ఇలా ! - Todays Horoscope of 12 Zodiac Signs
నేటి రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే
Todays Horoscope : మీ రాశి ఫలాల్లో ఏముందో తెలుసుకోండి మరి !
By
Published : May 31, 2021, 4:35 AM IST
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోకూడదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జరిపించాలి.
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
ఉద్యోగంలో మీపై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జరిపించాలి.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉన్నది. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.
గమ్యం చేరే వరకు పట్టుదల వీడకండి. విజయ సిద్ధి ఉంది. ఎలాంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. శ్రీనివాసుని సందర్శనం శక్తినిస్తుంది.
చేపట్టే పనిలో బద్ధకాన్ని వదలాలి. ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే బాగుంటుంది.
మీమీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మి ధ్యానం మంచినిస్తుంది.
ప్రయత్నానుకూలత ఉంది. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. శుభఫలితాలు కలుగుతాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.