జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా "ప్రజలలో నాడు - ప్రజల కోసం నేడు" కార్యక్రమంలో జగ్గయ్యపేట 12వ సచివాలయంలో 22, 23వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజలలో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమం - ycp leaders walk in jaggayapeta news
జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా "ప్రజలలో నాడు - ప్రజల కోసం నేడు" కార్యక్రమం జగ్గయ్యపేటలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పాదయాత్ర చేపట్టారు.
ప్రజలలో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమం
ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 17 నెలల కాలంలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను వినతిపత్రాల ద్వారా తెలుసుకుని వాటిని వెంటనే అధికారులతో ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.