కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పాత ఎండ్లలంక గ్రామాలు మధ్య ఉన్న కాజ్ వే పూర్తిగా కోతకు గురయ్యింది.దీంతో రెండు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.వరద కారణంగా కాజ్ వే దెబ్బతినటంతో,తాత్కాలికంగా ఇసుకతో రహదారిని ఏర్పాటు చేశారు.విషయం తెలుసుకున్న రెవెన్యూ,పోలీసు సిబ్బంది వెంటానే వచ్చి పరిస్థితిని పరిశీలించారు.గ్రామస్తులు పడవ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.త్వరగా ఎండ్లలంక గ్రామానికి వంతెన నిర్మాణం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పాత ఎండ్లలంకలో కోతకు గురైన కాజ్ వే - అవనిగడ్డ
ప్రకాశం బ్యారేజి నుండి కృష్ణనదిలోకి భారీగా వరద నీరు వడలడంతో, అవనిగడ్డ పాత ఎండ్లలంక గ్రామాలు మధ్య ఉన్న కాజ్ వే కోతకు గురయ్యింది. దీంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పాత ఎండ్లలంకలో వంతెన నిర్మించాలని...గ్రామస్తులు