గ్రామీణ ప్రాంతాల్లో కరోనా తీవ్ర రూపం దాల్చిందని... పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయకర్త రవి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలు భయపడిపోతున్నారని... ప్రభుత్వం గ్రామాలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. గతంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో శానిటైజేషన్ చేయడంతోపాటు అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాల్లో ఉన్నవారికి సీ, డీ, విటమిన్ మందులు ఇచ్చి, మాస్కులు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామాల్లో కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి - టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయకర్త రవి
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా తీవ్ర రూపం దాల్చిందని... పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయకర్త రవి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో శానిటైజేషన్ చేయడంతోపాటు అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు.

గ్రామాల్లో కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి