తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. పేద ప్రజలకు సహాయం అందించేందుకు తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని టీఎస్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
నాయకునిపై అభిమానం.. పేదలకు సహాయం - lockdown in nandigama
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తమకు తోచినంత సహాయం చేస్తూ తమ అభిమాన నాయకుడిపై ప్రేమను చాటుకుంటున్నారు.

నందిగామలో ఆహారం పంపిణీ చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు