ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పార్టీలతో సంబంధం లేకుండా పట్టణాభివృద్ధికి కృషి చేస్తాం' - తిరువూరు మున్సిపాలిటీ తాజా వార్తలు

పార్టీలతో సంబంధం లేకుండా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి చెప్పారు. తిరువూరు మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Tirupur Municipal First Council meeting
తిరువూరు మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం

By

Published : Apr 6, 2021, 4:45 PM IST

తిరువూరు పట్టణ అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామని మున్సిపల్ ఛైర్​పర్సన్ గత్తం కస్తూరిబాయి అన్నారు. ఆమె అధ్యక్షత జరిగిన మొదటి పాలకమండలి సమావేశంలో 10 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

సమావేశంలో ఎక్స్అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పాల్గొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వేసవి నేపథ్యంలో ప్రజలకు నీటి కొరత తీర్చేందుకు రూ. 10లక్షలు కేటాయించిన్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కేవీఎస్​ఎన్ శర్మ, వైస్ ఛైర్​ పర్సన్ వెలుగోటి విజయలక్ష్మి, కౌన్సిల్లర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details