కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి పుణ్యక్షేత్రం ఆలయ ఈవో డి.సాయిబాబుని సస్పెండ్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ పి.అర్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు.
సేవలు చేయించుకున్నాడు.. సేవలు చేసే భాగ్యం కోల్పోయాడు - tirumalagir EO suspended in jaggayapeta
జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి పుణ్యక్షేత్రం ఆలయ ఈవో డి.సాయిబాబును ఉన్నతాధికారులు సస్పెండ్ చేేశారు. సాయిబాబు ఆలయ ఆవరణలో మసాజ్ చేయించుకోవడం వంటి అసభ్య ప్రవర్తనకు పాల్పడినందుకు ఆయనపై వేటు వేశారు.
![సేవలు చేయించుకున్నాడు.. సేవలు చేసే భాగ్యం కోల్పోయాడు krishna distrct](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8167755-1031-8167755-1595673743935.jpg)
ఇటీవల ఈవో సాయిబాబు దేవాలయ ఆవరణలోనే మసాజ్ చేయించుకోవడం వంటి అసభ్య ప్రవర్తనకు పాల్పడినట్లు సామాజిక మాధ్యమాల్లో దృశ్యాలు వైరల్ అయ్యాయి. కేశకండనశాలలో క్షవరం చేయించుకోవడం, బాలికలను అక్కడికి అనుమతించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సంప్రదాయం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు ఆలయం మూసివేసి అంతా కొండ పైనుంచి దిగువకు వచ్చేయాలి. కానీ ఈఓ అక్కడే ఉండడంపై స్థానిక రాజకీయ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ దృశ్యాలు మీడియాలోనూ ప్రసారం కావడంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపించారు. ఈవో సాయిబాబును సస్పెండ్ చేసి అతని స్థానంలో ఇన్‌ఛార్జి ఈవోగా మూర్తిని నియమించారు.
ఇదీ చదవండి'ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయి'