రాజుల కాలంలో సమయం తెలుసుకోవడానికి గడియారాలు లేవు. ఎండ నీడను బట్టి సమయం లెక్కించి, ప్రజలకు తెలిసే విధంగా గంట మోగించేవారు. ఆధునిక యుగంలో అర చేతిలోనే ప్రపంచం కనిపిస్తున్నా.. శతాబ్దాల నుంచి వస్తున్న పద్ధతులను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
కృష్ణా జిల్లా చల్లపల్లిలో అప్పటి రాజు శ్రీరాజా యార్లగడ్డ గుర్వనీడు(1576-1607) కోటలో గంట గంటకూ గంట మోగిస్తూనే ఉన్నారు. సమయం మూడైతే మూడు సార్లు, నాలుగైతే నాలుగు సార్లు గంట మోగిస్తున్నారు. శ్రీ దేవరకోట సంస్థానాధీశ్వరుల వంశవృక్షం బోర్డులో అందరి పేర్లను ఉంచారు. అప్పటి భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.