కూరగాయల సాగు చేపట్టిన రైతులకు కోతుల బెడద ప్రధాన సమస్యగా మారింది. వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన రైతు శీలం శ్రీనివాసరావు వానరసేనను భయపట్టేందుకు పంట చేనులో పులిబొమ్మను ఏర్పాటు చేశాడు.
ఆ బొమ్మను చూసిన కోతులు... నిజంగా పులేనని భ్రమపడి అటుగా రావటానికి భయపడతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి శ్రమ లేకుండా కోతుల బెడద నుంచి రైతు తన పంటను రక్షించుకుంటున్నాడు. రైతుకు తట్టిన వినూత్న ఆలోచనను తోటి రైతులు అభినందిస్తున్నారు.