లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలని కోరుతూ విజయవాడ నగరంలోని పలు వార్డు సచివాలయాల వద్ద సీపీఐ నేతలు నిరసన చేపట్టారు. మొగల్రాజుపురంలో నగర సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్, అజిత్ సింగ్ నగర్లో కార్యవర్గ సభ్యుడు భాస్కరరావు ఆందోళనలు చేపట్టారు. టిడ్కో ఇళ్లను ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు. ఇళ్లకు విద్యుత్, నీరు, డ్రైనేజీ, రోడ్డు వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలను అయోమయానికి గురి చేయొద్దని కోరారు.
లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలి: సీపీఐ - కృష్ణా జిల్లా తాాజావార్తలు
విజయనగరంలో సీపీఐ నేతలు ఆందోళనలు చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలి