కృష్ణాజిల్లా నాగాయలంక మండలం దిండి గ్రామంలో పిడుగుపాటుకు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తాడిచెట్టుపై పిడుగుపడి... ఆ మంటలు కిందే ఉన్న పశువుల పాక మీద పడ్డాయి. గమనించిన స్థానికులు మంటల్ని ఆర్పేశారు. ప్రస్తుతం వరి సాగుకు వ్యవసాయ పనులు మొదలవడంతో... పొలంలో ఎక్కడ పిడుగులు పడతాయోనని ఆందోళన చెందుతున్నారు.
పిడుగుపడి భగ్గుమన్న తాడిచెట్టు... భయాందోళనలో ప్రజలు - కృష్ణా జిల్లాలో పిడుగు వార్తలు
పచ్చని చెట్టు పిడుగుపడి మాడి మసైపోయింది. దానికి తోడు పక్కనే ఉన్న పశువులపాక మీద నిప్పురవ్వలు పడ్డాయి. ఇలా ఇంకా ఎన్ని పిడుగులు పడతాయోనని కృష్ణాజిల్లా దిండి గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కృష్ణాజిల్లా దిండి గ్రామంలో తాడిచెట్టుపై పిడుగు