ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

DEVINENI: పరిటాలలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. పరిశీలించిన దేవినేని ఉమ - పరిటాలలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ అక్కడి పరిస్థితిని పరిశీలించారు. విగ్రహం ద్వంసం చేసిన దుండగులను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పరిటాలలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం
పరిటాలలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం

By

Published : Jul 7, 2021, 3:37 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహం చేయిని ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిస్థితిని పరిశీలించారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉమా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు.

నందిగామలో జెండా దిమ్మె పగలగొట్టిన కేసులో ఎంత మంది పైన కేసులు పెట్టారని నిలదీశారు. 28 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కృష్ణా జలాల విషయంలో ఉపయోగం ఏమీ లేదని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో ప్రధాన మంత్రిని కలవలేక కేవలం ఉత్తరాలు రాస్తున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్​కు వెళ్లి బిర్యాని తిన్నప్పుడు కృష్ణాజలాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details