కృష్ణాజిల్లా గుడివాడ బంట్టుమిల్లి రోడ్డు శ్రీనివాస్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు పోతురాజు విగ్రహం ధ్వంసం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భాజాపా, హిందూ సంఘాల ప్రతినిధులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి...ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూమనోభావాలు కాపాడాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతుండగా... డీఎస్పీ సత్యానందం వెళ్లడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విగ్రహం ధ్వంసంలో కుట్ర కోణం ఉందని హిందూ సంఘాలు ఆరోపించాయి. చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దనడంతో డీఎస్పీకి.. హిందు సంఘాలకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
బంట్టుమిల్లిలో పోతురాజు విగ్రహం ధ్వంసం - బంట్టుమిల్లిలో పోతురాజు విగ్రహం తాజా వార్తలు
కృష్ణాజిల్లా గుడివాడ బంట్టుమిల్లి రోడ్డు శ్రీనివాస్ సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తులు పోతురాజు విగ్రహం ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. దీనిపై భాజాపా నిరసన చేపట్టగా... స్వల్ప వాగ్వాదం జరిగింది.
బంట్టుమిల్లిలో పోతురాజు విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు