ఇక్కడ కనిపిస్తున్న ఈ బాల మేధావి పేరు జై. మూడేళ్ల వయసులోనే...195 దేశాల జాతీయ జెండాలను గుర్తించటంతో పాటు రసాయన శాస్త్రంలోని మూలకాలతోపాటు... గ్రహాలు, కారు లోగోలను ఇట్టే చెప్పేస్తాడు. ఆంగ్లంలో చిన్న పదాలు, హిందీ, తెలుగు అక్షరాలను అప్పజెప్పేస్తూ... అబ్బురపరుస్తున్నాడు.
కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన ప్రవీణ్ కుమార్ దంపతులు... వైద్యులుగా అమెరికాలోని సౌత్ కరోలైనాలో ఉంటున్నారు. వారి కుమారుడు జై. కరోనా మొదలవ్వక ముందు జనవరిలో జై తల్లిదండ్రులు ఘంటసాల తీసుకొచ్చి... బాలుణ్ని తాతయ్య , నాయనమ్మ దగ్గర వదిలి అమెరికాకు వెళ్ళారు. అప్పుడే చిన్నారి ప్రతిభను గుర్తించిన నానమ్మ... జై కు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంట్లో ఉన్న ప్రపంచ పటాన్ని చూపిస్తూ దేశాలను గుర్తు పట్టడం నేర్పించారు. వెంటనే ఆకళింపు చేసుకొని ఎలా అడిగినా టకటకా జవాబులు చెప్పేస్తూ ఉండటంతో.... అమెరికా నుంచి ప్రత్యేకంగా వివిధ దేశాల జెండా కార్డులు తెప్పించి వాటిని గుర్తు పట్టడం నేర్పారు.