ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి - boy died at gopalpuram

బుడిబుడి అడుగులు వేస్తూ సందడి చేసే కుమారుడిని చూస్తూ తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ ఆ మురిపెం ఎక్కువ రోజులు నిలవలేదు. రోజూ లాగే అడుకునేందుకు వెళ్లిన వారి కొడుకు.. ప్రమాదవశాత్తు సమీపంలోని బావిలో పడ్డాడు. వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

boy died at gopalpuram
బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి

By

Published : Feb 26, 2021, 3:31 PM IST

కృష్ణా జిల్లా కలిదిండి మండలం గోపాలపురంలో మంచినీటి బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. నాగశ్రీను, లక్ష్మీకుమారిల కుమారుడు బలరామకృష్ణ ఇంటి సమీపంలో ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. తమ కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details