కృష్ణా జిల్లా గన్నవరంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ అవగాహన ర్యాలీ చేపట్టారు. కరోనా నివారణకు మూడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు.
మాస్కులు వాడడం, చేతులు శుభ్రపరచడం, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే కొవిడ్-19 పరీక్ష చేయించుకోవాలన్నారు. సరైన సమయంలో టెస్టులతో ప్రమాదం నుంచి బయటపడవచ్చని చెప్పారు.