SUICIDE: అప్పుల బాధలు తాళలేక ఓ చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన విషాదమిది. కృష్ణా జిల్లా పెడన పట్టణంలోని 17వ వార్డుకు చెందిన కాశిన పద్మనాభం(55) కుటుంబ అవసరాలకు వడ్డీ వ్యాపారి మెట్ల విఠల్‌లోకేష్ వద్ద రూ.2 లక్షల అప్పు చేశారు. వడ్డీతో సహా ఆ మొత్తం రూ.4.60 లక్షలకు చేరింది. ఇందులో రూ.1.86 లక్షలు మార్చి ఒకటిన చెల్లించాలన్న షరతుతో ఇటీవల పద్మనాభంతో నోటరీ చేయించారు. చెల్లించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని అందులో స్పష్టంచేశారు. గడువులోగా అంతమొత్తం సమకూర్చడం సాధ్యం కాదని ఆందోళన చెందిన పద్మనాభం, భార్య నాగలీలావతి(47), కుమారుడు రాజానాగేంద్రం(27)లతో కలిసి సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం మంగళవారం వెలుగుచూడటంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చి కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించిన తండ్రీకుమారులు మెట్ల విఠల్ లోకేష్, జీవన్‌ప్రసాద్‌లపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదుచేశారు. మృతదేహాలకు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం పెడనలో అంత్యక్రియలు పూర్తిచేశారు. పద్మనాభం కుమార్తె నక్కిన వెంకటనాగలక్ష్మి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
SUICIDE: అప్పుల బాధ తాళలేక!... చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
ముగ్గురు ఆత్మహత్య
10:03 February 01
దంపతులతో పాటు కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్య
* అనంతపురం జిల్లా ధర్మవరంలో అప్పుల బాధతో లక్ష్మీనారాయణ (34) అనే యువ చేనేత కార్మికుడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
* ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని బుధవారం తెదేపా బృందం పరామర్శించనుంది. బృందంలో తెదేపా నేతలు అనగాని సత్యప్రసాద్, అంగర రామ్మోహన్, గంజి చిరంజీవి, ఎమ్‌ఎస్ రాజు, వావిలాల సరళాదేవి సభ్యులుగా ఉంటారు.
ఇదీ చదవండి:
Service Sector in Andhra Pradesh: రాష్ట్రంలో.. తిరోగమనంలో సేవల రంగం
Last Updated : Feb 2, 2022, 6:59 AM IST