కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో తెల్లవారుజామున ఓ లారీ.. ఇంట్లోకి దుసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
సామాన్లు, ఇంటి గోడ పూర్తిగా ధ్వంసం అయ్యాయనీ.. న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. క్వారీ లారీల ఆగడాలు ఆపలేకపోతున్నామని స్థానికులు వాపోయారు. ఇటీవల కరెంటు స్తంభాన్ని ఓ లారీ ఢీకొట్టిందని వారు చెప్పారు.