ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో రోడ్డుప్రమాదాలు..ముగ్గురికి గాయాలు - మైలవరంలో రోడ్డుప్రమాదం

కృష్ణాజిల్లాలో పలుప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరుచోట్ల జరిగిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు.

three injured in krishna district accidents
కృష్ణా జిల్లాలో రోడ్డుప్రమాదాలు

By

Published : Mar 12, 2021, 12:20 PM IST

ఇనుప డిస్క్​తో సుమారు 25 కిలోమీటర్లు..
కృష్ణాజిల్లా మొవ్వ కోర్టు వద్ద ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆపకుండా వెళ్లిపోయిన కారుని కూచిపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూచిపూడి పోలీసులు స్థానికులు వెంబడించి పెనుమూడి టోల్ గేట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. కారు నెంబరు AP07 DW 4567గా పోలీసులు గుర్తించారు. కారు ఒకవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది., కారు టైరు కూడా పగిలిపోయింది. వాహనదారులు పగిలిన టైరుతో ఇనుప డిస్క్​తో సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. కారులో నలుగురు వ్యక్తులు ఉండగా ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

బైకు ఢీకొన్న ఆర్టీసీ బస్సు

కృష్ణా జిల్లా మైలవరంలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. ఎ.కొండూరు మండలం గొల్లమందల గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మణుగూరు బస్సు ఢీకొట్టడంతో అతనికి కాలు విరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మల్లేశ్వరరావు తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. బాధితుడిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి.గుత్తి శివారులో జీపు బోల్తా.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details