విజయవాడ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కండ్రిగ - పాతపాడు రహదారిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు వాంబేకాలనీ వాసులుగా తెలుస్తోంది.
ACCIDENT: కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి - byke accident news
07:13 September 27
accident in vijayawada
కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో..
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి జాతీయ రహదారిపై గన్నవరం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించిగా మరో యువకుడికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గుంటూరు జిల్లా కల్లూరుకి చెందిన సాయికుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆత్కూరు ఎస్సై జీ. శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి:Bus Accident: బాదంపూడి వై-జంక్షన్ వద్ద బస్సు బోల్తా.. బస్సులో 40 మంది ప్రయాణికులు