కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆడుకోవడానికి వెళ్లిన బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మృతులు కోటా మనోహర చక్రవర్తి(10), కోటా శ్రావణ్ కుమార్(8), కంటా సాయి(12)గా గుర్తించారు.
చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి - కృష్ణా జిల్లాలో చెరువులో పడి ముగ్గురు చిన్నారు మృతి
కృష్ణా జిల్లా తెల్లదేవరపల్లిలో ముగ్గురు బాలురు అదృశ్యం ఘటన విషాదాంతం అయ్యింది. గ్రామంలోని చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆడుకోవడానికి వెళ్లిన బాలురు ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు.
చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి
మంగళవారం సాయంత్రం నుంచి పిల్లల ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన గురయ్యారు. ముందుగా గ్రామస్థులు, కుటుంబ సభ్యులు గ్రామం మొత్తం వెతికారు. అనంతరం చెరువులో చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. బాలురు మృతితో గ్రామంలో విషాదం అలముకుంది.
ఇదీ చదవండి :పక్కింటి వ్యక్తిని భయపెట్టేందుకు.. అమాయకుడిని అంతమొందించాడు..