గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పాత అంబాపురంలో దళిత యువకుడు దోమతోటి విక్రమ్ దారుణ హత్యను తెదేపా తీవ్రంగా ఖండిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. జగన్ పాలనలో దళితులపై మారణకాండ సాగుతోందని ఆరోపించారు. విక్రమ్ హంతకుల్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
'వైకాపా పాలనలో దళితులపై మారణకాండ ' - young man murder in guntur district
వైకాపా ప్రభుత్వం దళితులను పీడిస్తోందని తెదేపా నేత నక్కా ఆనంద బాబు విమర్శించారు. దళిత యువకుడు దోమతోటి విక్రమ్‌ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
విక్రమ్ హత్యకు ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి కుట్ర పన్నారని.. దీనికి సీఐ సహకరించారని నక్కా ఆనంద బాబు ఆరోపిచారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విక్రమ్ హత్య, డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివాడిగా ముద్ర వేయటం, మహిళా డాక్టర్ బట్టలు మార్చుకుంటుంటే ఫొటోలు తీయడం, బోటు ప్రమాదంపై ప్రశ్నించిన హర్షకుమార్‌ని జైల్లో పెట్టడం, మాజీ మేజిస్ట్రేట్ శ్రావణ్ కుమార్‌ని బెదిరించడం, అసైన్డ్ భూముల స్వాధీనాన్ని వ్యతిరేకించిన మహాసేన రాజేశ్‌పై అక్రమ కేసులు... ఇవన్నీ దళితులను వైకాపా ప్రభుత్వం పీడిస్తోందనడానికి ఉదాహరణలని ఆనంద బాబు విమర్శించారు.
ఇదీ చదవండి:పోలీసులపై కుక్కలను వదిలిన వైకాపా నేత పీవీపీ