ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా టీకాపై అనుమానాలు వీడాలి : జిల్లా కలెక్టర్ - కృష్ణా జిల్లా లో కరోనా కేసులు

జిల్లా వ్యాప్తంగా మూడో దశ కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. వ్యాక్సిన్​పై అనుమానాలు వీడి ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లించి టీకా పొందవచ్చని తెలిపారు.

third face corona vaccination in krishna district
కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్

By

Published : Mar 1, 2021, 4:06 PM IST

కరోనా టీకాపై అనుమానాలు వీడి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ అహ్మద్‌ కోరారు. జిల్లా వ్యాప్తంగా మూడో దశ టీకా పంపిణీ మొదలైందని ఆయన తెలిపారు. 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. టీకా తీసుకునే వారు వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 23 ప్రభుత్వాసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీలతోపాటు ఏడు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా టీకా పొందే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులో రూ.250 చెల్లించి టీకా తీసుకోవచ్చని ఇంతియాజ్ అహ్మద్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details