విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా వేదమాతగా గాయత్రీ దేవిగా అమ్మవారిని ఆలంకరించారు. ముక్తా, విధృమ హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశించు పంచ ముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవతగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
గాయత్రీమాతగా అమ్మలగన్నయమ్మ దర్శనం - vijayawada kanakadurgamma latest news update
ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గ ఆలయంలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
గాయత్రీమాతగా అమ్మలగన్నమ్మ దర్శనం
ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే ఆరోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ, అమ్మవారిని దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: