ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ చోరీ: రూ. కోటి విలువైన బంగారం, వెండి ఆభరణాలు మాయం - గురజాడలో దొంగల హల్ చల్

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో వృద్ధురాలి ఇంటో చోరీ జరిగింది. సుమరు కోటి విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

robbery at gurajada
వృద్ధురాలి ఇంటో దొంగతనం

By

Published : Nov 24, 2020, 10:09 AM IST

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన చల్లా రాజేశ్వరి అనే 70 ఏళ్ల మహిళ ఇంట్లో సుమారు కోటి విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

రాజేశ్వరి హైదరాబాద్​లో తన సోదరుని ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత ఇంటి తలుపులు తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి చూడగా.. ఆభరణాలు మాయమైన విషయం తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభంచారు. జాగిలాలు, క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details