కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు బైపాస్ ప్రాంతంలో లారీ డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి నగదు దోపిడీ చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ రూరల్ రామవరప్పాడు పరిధిలో నివసించే బొల్లు శివరామకృష్ణ, పుప్పాల ప్రశాంత్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం, గంజాయికి అలవాటుపడి.. ఆ మత్తులో దోపిడీ చేసినట్లు సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపారు.
కత్తితో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్ - పెనమలూరు నేర వార్తలు
కృష్ణా జిల్లాలో మిని లారీ డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన వారు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కత్తితో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్
ఈ నెల 19వ తేదీన విజయవాడ భవానీపురం నుంచి ఉయ్యూరు వైపు చేపల లోడుతో వెళుతోన్న మినీ వ్యాన్న అడ్డగించి డ్రైవర్ మహమ్మద్ ఇస్లాంపై కత్తితో దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. దాడికి పాల్పడిన కత్తితో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:విజయవాడలో శానిటైజర్ తాగి ఇద్దరు మృతి