కృష్ణాజిల్లాలో గుడివాడ-బంటుమిల్లి రోడ్డులో ఇవాళ ఉదయం పోతురాజు విగ్రహం వద్ద హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చెప్పారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు... మద్యం కోనుగోలు కోసం చోరీ చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయిందన్నారు. ఉదయం భాజపా, జనసేనలతో పాటు మరికొన్ని సంఘాలు ధర్నా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సున్నితమైన విషయాలలో నిర్ధారణ లేకుండా నిరసనలు తెలియజేయడం సరికాదని ఎస్పీ హితవు పలికారు. అంతర్వేది ఘటన అనంతరం జిల్లాలోని అన్ని మతాల ప్రార్థనాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లపై ఆడిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు.
హుండీ చోరీకి పాల్పడిన దొంగలు అరెస్టు: ఎస్పీ - krishna district latest news
గుడివాడ-బంటుమిల్లి రోడ్డులో పోతురాజు విగ్రహం వద్ద హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చెప్పారు. మద్యం కోసం దొంగతనం చేసినట్టు ఎస్పీ వివరించారు.
హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తులు అరెస్టు: ఎస్పీ
Last Updated : Sep 12, 2020, 8:25 PM IST