రాత్రిపూట ఇళ్లలో చోరీ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కృష్ణా జిల్లా కంచికచెర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఈ ముఠా రాత్రివేళలో దొంగతనాలు చేసి విలువైన బంగారం, వెండి నగలను దోచేవారు. ఈ వస్తువులను ప్రైవేట్ ఫైనాన్స్లలో తాకట్టు పెట్టేవారని సీసీఎస్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. వీరి వద్ద నుంచి మూడు కిలోల వెండితో పాటు రూ. 6,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కంచికచెర్లలో తెలంగాణకు చెందిన దొంగల ముఠా అరెస్ట్ - thief gang arrested in krishna district
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన దొంగల ముఠాను కృష్ణా జిల్లా కంచికచెర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కొంత నగదు, మూడు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కంచికచెర్లలో దొంగల ముఠా అరెస్ట్