ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మినీ క్లినిక్​లా 104... మినీ ఐసీయూలా 108 వాహనాలు! - కొత్త 108, 104 వాహనాలు వార్తల

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 104, 108 నూతన వాహనాలు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జులై 1న శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ బెంజిసర్కిల్‌ కూడలిలో వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ క్రమంలో నూతన వాహనాల ప్రత్యేకత ఏంటి? అందులో ఎలాంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి? వంటి విషయాలను 104, 108 రాష్ట్ర నోడల్ అధికారులు ఈటీవీ భారత్​కు వివరించారు.

these are the  eminences of new 108,104 Vehicles
these are the eminences of new 108,104 Vehicles

By

Published : Jun 29, 2020, 6:51 PM IST

104, 108 రాష్ట్ర నోడల్ అధికారులతో ముఖాముఖి

104, 108 నూతన వాహనాలు జులై 1 నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి. వీటిల్లో అత్యానిధునిక పరికరాలు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఈ వాహనాల్లో ఉన్నాయని వెల్లడించారు.

  • 104తో ఇంటి వద్దకే సేవలు

మొత్తం 656.... 104 వాహనాలు జులై 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని 104 రాష్ట్ర నోడల్ అధికారిణి డాక్టర్ శ్యామల వెల్లడించారు. వీటిని మండలానికి ఒకటి చొప్పున కేటాయిస్తామని తెలిపారు.

'వాహనంలోనే క్లినిక్ ఏర్పాటు చేసేలా పరికరాలు అమర్చాం. ఈసీజీ యంత్రం, డిజిటల్ థర్మోమీటర్ వంటి 29 రకాల యంత్రాలు 104 వాహనంలో ఉన్నాయి. నెలలో 24 రోజులు ఇవి పనిచేస్తాయి. గ్రామ సచివాయాల ప్రాతిపదికన ఓ షెడ్యూల్ తయారు చేశాం. దాని ప్రకారమే ఈ వాహనాలు ఆయా గ్రామాలకు వెళ్తాయి. 74 రకాల మెడిసిన్లు ఈ వాహనంలో ఉంటాయి. ఉదయం ఓపీ సేవలు.... మధ్యాహ్నం నుంచి స్కూళ్లు, అంగన్​వాడీలకు ఈ వాహనాలు వెళ్తాయి. మంచానికే పరిమితమైన వారికి చికిత్స అందించేందుకు వారి ఇంటి వద్దకే వెళ్తాయి' అని డాక్టర్ శ్యామల వివరించారు.

  • మరిన్ని సదుపాయాలతో 108 వాహనం

412 నూతన... 108 వాహనాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని 108 రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ ఖాన్ వెల్లడించారు. వీటిని మూడు రకాలుగా విభజించినట్లు తెలిపారు. నవ జాత శిశువుల కోసం ప్రత్యేక పరికరాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ యంత్రాలు మినీ ఐసీయూలా తయారు చేసినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

హైదరాబాద్ - విజయవాడ మధ్య హై స్పీడ్‌ రైలు రావాలి: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details