ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంటర్​ ప్రాక్టికల్స్​లో మాస్ కాపీయింగ్ జరగట్లేదు' - ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగట్లేదన్న నూజివీడు మండల తహసీల్దారు ఎం.సురేష్ కుమార్

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగట్లేదని నూజివీడు మండల తహసీల్దారు ఎం.సురేష్ కుమార్ స్పష్టం చేశారు. నూజివీడులోని ఎస్డీఏ జూనియర్ కళాశాల్లో పరీక్షల తీరును సబ్​ కలెక్టర్​ నేతృత్వంలోని అధికారుల బృందం పరిశీలించింది.

There is no mass copying in the intermediate practical exams
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరిశీలించిన నూజివీడు సబ్ కలెక్టర్ దినకర్

By

Published : Feb 6, 2020, 6:46 PM IST

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ తీరును పరిశీలించిన అధికారులు

కృష్ణా జిల్లా నూజివీడులో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని మండల తహసీల్దారు ఎం.సురేష్ కుమార్ స్పష్టం చేశారు. నూజివీడులోని ఎస్డీఏ జూనియర్ కళాశాలలో సీఏఎస్ఈసీ ప్రాక్టికల్ పరీక్షలను అధికారులు పరిశీలించారు. ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందని ఆరోపణలు రావటంతో సబ్ కలెక్టర్ నేతృత్వంలో బృందంగా వెళ్లి పరిశీలన చేసినట్లు సురేష్ కుమార్ తెలిపారు. 138 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు ఆరు గదులను కేటాయించినట్లు చెప్పారు. ఈ పరీక్షలకు సంబంధంలేని లోయర్ క్లాస్ ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్స్​గా కళాశాల యాజమాన్యం నియమించినట్లు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాన్ని నిశితంగా పరిశీలించి... ప్రామాణికత ప్రకారం విద్యార్థులు ముందడుగు వేస్తే సరైన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details