విజయవాడలో లాక్డౌన్ అమలులో ఎలాంటి మినహాయింపులు లేవని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. లాక్డౌన్లో సడలింపులు ఇచ్చారని కొంతమంది వ్యక్తులు రోడ్లపైకి వస్తున్నారని... నిబంధనలు పాటించకపోతే క్వారంటైన్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉన్నవారంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్లో నూరు శాతం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని పాలనాధికారి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం 36 కంటైన్మెంట్ కసర్లను గుర్తించిందని... విజయవాడ నగర పరిధిలో 20 క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మొబైల్ వాహనాలతో ఇంటికే నిత్యావసరాలు పంపిణీ చేస్తామని చెప్పారు.