ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్-1కి మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్‌ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఒకే సిలబస్‌తో రెండు పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నందున అభ్యర్థులు ఎక్కువ సమయాన్ని శిక్షణా కేంద్రాల్లోనే గడపాల్సి వస్తోంది. అలాగే ఫీజుల పేరుతో వేల రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందువల్ల గ్రూప్-2, గ్రూప్-3, ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, కొన్ని ఇంజినీరింగ్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్, మెయిన్స్ అని లేకుండా గతంలో మాదిరిగా ఒకే పరీక్ష నిర్వహించనున్నారు.
గ్రూప్-1 మినహా ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమ్స్ ఉండదు!
ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్-1కి మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్‌ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఒకే సిలబస్‌తో రెండు పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నందున అభ్యర్థులు ఎక్కువ సమయాన్ని శిక్షణా కేంద్రాల్లోనే గడపాల్సి వస్తోంది.
గ్రూప్-1 మినహా ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమ్స్ ఉండదు
ఒకే పరీక్ష పద్ధతిని అనుసరిస్తే అభ్యర్థుల సంఖ్య మేరకు 2, 3 రోజుల పాటు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల కొందరికి ప్రశ్నలు సులువుగా మరికొందరికి కఠినంగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులకు నష్టం జరగకుండా వారి ప్రతిభను గుర్తించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నారు.
ఇవీ చదవండి
నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్
Last Updated : Jun 18, 2021, 6:15 AM IST