విజయవాడ పాయకాపురంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. నిన్న ఓ ఆగంతకుడు హల్చల్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో లభ్యమయ్యాయి. దొంగతనానికి వచ్చిన అతను ఇంటి యజమాని సతీష్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. బాధితుడు నున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటానికి వెళ్లగా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇవాళ అదే ప్రాంతంలో ఓ హోటల్లో సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలో సంఘటనలు జరగటంతో స్ధానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
పాయకాపురంలో వరుస దొంగతనాలు... ఆందోళనలో ప్రజలు - కృష్ణాజిల్లా నేర వార్తలు
విజయవాడ పాయకాపురంలో వరుస దొంగతనాలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. పోలీసులు స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
పాయకాపురంలో వరుస దొంగతనాలు...భయాందోళనలో ప్రజలు