ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాళాలు పగులగొట్టి చోరీ.. రూ.9 లక్షలు, కేజీ వెండి మాయం - కుందావారి కండ్రికలోని ఓ ఇంట్లో భారీ దొంగతనం

విజయవాడ గ్రామీణా శివారు కుందావారి కండ్రికలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగులగొట్టిన దుండగులు.. ఉన్నదంతా ఊడ్చేశారు. రూ. 9 లక్షల నగదు, కేజీ వెండి, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

theft in a house at kundavari Kandrika
కుందావారి కండ్రికలోని ఓ ఇంట్లో భారీ దొంగతనం

By

Published : Dec 13, 2020, 7:10 AM IST

విజయవాడ గ్రామీణ శివారులోని కుందావారి కండ్రికలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే పునం సామ్రాజ్యం అనే మహిళ ఇంట్లో భారీగా నగదు, ఆభరణాలు మాయమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన దొంగలు.. తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.

రూ. 9 లక్షలు, కేజీ వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆధారాలు దొరక్కుండా నిందితులు కారం చల్లినట్టు... ఘటనా స్ధలాన్ని పరిశీలించిన విజయవాడ గ్రామీణా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు క్లూస్ టీం బృందాలతో గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details