ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యటక హోటళ్లు, రెస్టారెంట్లు... ప్రైవేట్​కు..! - పర్యాటక హోటళ్లు లీజుకు

హోటళ్లు, రెస్టారెంట్లు ప్రైవేట్​కు లీజుకు ఇచ్చేందుకు... పర్యటక అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. 41 చోట్ల లీజుకు ఇచ్చేందుకు ప్రదేశాలను ఖరారు చేసింది. పర్యటక అభివృద్ధి సంస్థ వీటికి టెండర్లు ఆహ్వానించింది.

ఏపీ టూరిజం
ఏపీ టూరిజం

By

Published : Dec 6, 2019, 12:07 AM IST

రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థకు వివిధ జిల్లాల్లో ఉన్న 11 హోటళ్లు , రెస్టారెంట్లు, రిసార్ట్స్​ను ఆపరేషన్, మెయింటెనెన్స్‌ విధానంలో ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వబోతున్నారు. నష్టాల్లో ఉన్న వీటిని మూసి వేయడం కంటే... ప్రైవేట్​కు ఇవ్వడం ద్వారా సంస్థకు ఏటా ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేశారు. లీజుకి ఇవ్వనున్న వాటిలో అత్యధికంగా రెస్టారెంట్లు, రిసార్ట్స్​ ఉన్నాయి.

కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా 15 ఏళ్లపాటు లీజుకి ఇవ్వబోతున్న వాటి కనీస ధరను ఇటీవలే నిర్ణయించారు. నెలాఖరులోగా బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేసి కొత్త ఏడాది ప్రారంభంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. విశాఖలో నాలుగు, కాకినాడలో ఐదు, విజయవాడలో ఒకటి, నెల్లూరులో 14, తిరుపతిలో నాలుగు, కడపలో ఏడు, కర్నూలులో ఆరు రెస్టార్టెంట్లు, రిసార్ట్స్​, హోటళ్లను ప్రైవేట్​కు ఇవ్వబోతున్నారు.

పర్యటక శాఖకు చెందిన స్థలాల్లో 3 చోట్ల ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో నక్షత్ర హోటళ్లు, కన్వెన్షన్ హాళ్లు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య సముదాయాల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు. విశాఖ, కాకినాడ, కాణిపాకంలో నక్షత్ర హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు ప్రతిపాదించారు. తిరుపతికి సమీపంలోని గొల్లపల్లిలో పర్యటకులకు ఆతిథ్య, శిక్షణ కేంద్రం, ఇతర కార్యకలాపాల ఏర్పాటుకు నిర్ణయించారు.

ఇదీ చదవండి

'అమరావతి తప్పు అని ప్రజలు అంటే... క్షమాపణ చెప్తా'

ABOUT THE AUTHOR

...view details