చెరువు వివాదం.. గ్రామస్థులు, సొసైటీ మధ్య చిచ్చు పెట్టింది. కృష్ణా జిల్లా నందివాడ మండలం ఇలపర్రు సొసైటీ చెరువు నీటి విషయంలో వివాదం తలెత్తింది. నీటి విషయంలో వాగ్వాదంతో.. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. భారీ బందోబస్తు మోహరించారు. పరిస్థితి చేయి దాటకుండా కట్టడి చేశారు.
ఇలపర్రులో ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు - krishna district crime
కృష్ణా జిల్లా నందివాడ మండలం ఇలపర్రు సొసైటీ చెరువు విషయంలో రైతులు, సొసైటీ సభ్యుల మధ్య వివాదం జరిగింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలు జరగకుండా ఇలపర్రులో భారీగా పోలీసులు మోహరించారు.
ఇలాపర్రులో ఉద్రిక్త పరిస్థితులు... పోలీసుల మోహరింపు