ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆత్మహత్యలకు పాల్పడిన రైతులను వెంటనే ఆదుకోవాలి' - krishna district news

అవనిగడ్డ నియోజకవర్గంలో నివర్ తుపాన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని తెదేపా పరిశీలక కమిటీ డిమాండ్ చేసింది.

TDP Monitoring Committee
బాధిత కుటుంబాలను పరామర్శించిన తెదేపా నేతలు

By

Published : Dec 25, 2020, 7:08 AM IST


కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో నివర్ తుపాన్ కారణంగా పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమెల్యే బోడె ప్రసాద్​లు డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించారు.

ఇసుక అక్రమ రవాణాపై అవనిగడ్డ ఎమ్మెల్యే ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం ఏ తరహా ప్రజాస్వామ్యమని తెదేపా నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా అందక పోవటం వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. రైతులు నష్టపోయి కన్నీరు మున్నీరు అవుతుంటే ముఖ్యమంత్రి గాలిలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details