బ్లాక్ ఫంగస్(Black Fungus) చికిత్సలో ఉపయోగించే యాంపొటెరిసిన్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. కరోనా సోకిన వారికి బ్లాక్ ఫంగస్(Black Fungus) సోకుతుండటంతో.. వాటి చికిత్సకు వినియోగించే యాంపొటెరిసిన్ ఇంజక్షన్లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఆరువేల రూపాయల ఖరీదు చేసే ఇంజక్షన్ ను 55 వేల రూపాయలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందుల దుకాణాలు, మెడికల్ రంగానికి సంబంధించిన పలువురు సిబ్బంది ఈ ముఠాలో ఉన్నట్లు విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు తెలిపారు. మొత్తం 10 మంది ఉన్నట్లు సీపీ చెప్పారు. ఈ ఇంజక్షన్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి .. బ్లాక్ మార్కెటింగ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.
Arrest: బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్ల ముఠా అరెస్టు - బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్లు తాజా సమాచారం
బ్లాక్ ఫంగస్(Black Fungus) చికిత్సలో వినియోగించే యాంపొటెరిసిన్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. ఆరువేల రూపాయల ఖరీదు చేసే ఇంజక్షన్‌ను 55 వేల రూపాయలకు విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్
TAGGED:
విజయవాడ తాజా వార్తలు