లాక్డౌన్ నేపథ్యంలో వైద్యం, ప్రభుత్వ విధులు, ఇతర అత్యవసర పనుల కోసం వెళ్తున్న వారు ఇబ్బందులు పడకుండా అత్యవసర పాసులు జారీ చేసేందుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది. అనుమతి పత్రాల జారీకి జిల్లాలు, ముఖ్య నగరాలకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్లు, ఈ- మెయిళ్లను ఏర్పాటు చేసింది. అత్యవసర పాసులు కావాలనేవారు సంబంధిత జిల్లాలకు కేటాయించిన వాట్సాప్ నంబర్లు, ఈ - మెయిల్ ఐడీకి పూర్తి పేరు, చిరునామా, ఆధార్ కార్డు నంబరు, వాహన నంబరు, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. దీని ఆధారంగా పాస్‌లు దరఖాస్తు చేసుకున్న వాట్సాప్, మెయిల్ ఐడీకి పంపిస్తారు. ఇతరుల నంబరు, మెయిల్ నుంచి పంపితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని డీజీపీ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. అనుమతి పత్రం పొందిన వారు గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవాలని, తప్పుడు సమాచారమిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వారి కోసం పోలీస్‌శాఖ ప్రత్యేక పాస్‌లు జారీ
అత్యవసర పనులు కోసం వెళ్తున్న వారికి లాక్‌డౌన్‌తో ఇబ్బంది కలగకుండా రాష్ట్ర పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తోంది. ఇవి కావాల్సిన వారు పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ap police