ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ 5 మండల పరిషత్‌ల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ - ap election notification news

రాష్ట్రంలో 5 మండల పరిషత్‌ల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల 5న ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.  అదేవిధంగా 13 జిల్లాల్లోని 26 గ్రామ పంచాయితీ ఉప సర్పంచ్‌ల ఎన్నికకూ ఎస్ఈసీ మరో నోటిఫికేషన్ జారీ చేశారు

election
election

By

Published : Apr 30, 2022, 5:52 AM IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అయిదు మండల పరిషత్తు అధ్యక్షుల (ఎంపీపీ), తొమ్మిది ఉపాధ్యక్షుల, మరో రెండు కో-ఆప్షన్‌ సభ్యుల స్థానాలకు ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం మూడు నోటిఫికేషన్లు వేర్వేరుగా జారీచేసింది. నిర్దేశిత గడువులోగా నామినేషన్లు స్వీకరించి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నీలం సాహ్ని ఆదేశించారు.

*పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, కృష్ణా జిల్లా ఉంగుటూరు, పల్నాడు జిల్లా పెదకూరపాడు, నెల్లూరు జిల్లా పొదలకూరులో నాలుగు మండల పరిషత్తు అధ్యక్ష స్థానాలు, కోనసీమ జిల్లా రాయవరంలో రెండు ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చారు. మే 5న ఉదయం 11 గంటల నుంచి ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇందుకోసం అందరు ఎంపీటీసీ సభ్యులకు మే 1లోగా సమాచారం అందజేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏదైనా కారణాలతో 5న ఎన్నికలు నిర్వహించని పక్షంలో 6న పూర్తి చేయాలన్నారు.
*చిత్తూరు జిల్లా రామకుప్పంలో మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల, అన్నమయ్య జిల్లా కలికిరి, శ్రీసత్యసాయి జిల్లా తలుపుల, పల్నాడు జిల్లా నరసరావుపేట, కృష్ణా జిల్లా చల్లపల్లి, ఏలూరు జిల్లా లింగపాలెం, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల పరిషత్‌ ఉపాధ్యక్ష స్థానాల కోసం మరో నోటిఫికేషన్‌ ఇచ్చారు. మే 5న ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎంపీటీసీ సభ్యులకు మే 1లోగా సమాచారం అందించాలని సూచించారు.
*తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం మూడో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ ఎన్నిక కోసం మే 5న ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించి అదే రోజు పూర్తి చేయనున్నారు. వేరే ఇతర కారణాలతో వాయిదా పడితే 6న ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు.

41 ఉప సర్పంచి స్థానాలకూ ఎన్నికల నోటిఫికేషన్‌

రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న 41 ఉపసర్పంచి స్థానాలకూ రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు జారీచేసింది. గతంలో వివిధ కారణాలతో వాయిదా పడ్డ 26 స్థానాలకు మే 5న ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక పూర్తిచేయనున్నారు. ఏదైనా కారణంతో వీటిలో ఎన్నిక వాయిదా పడితే జిల్లా అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలి. దీంతో మరో తేదీలో ఎన్నికల నిర్వహణకు ఇంకోసారి నోటిఫికేషన్‌ ఇస్తారు. ఎన్నికలయ్యాక మృతిచెందిన, రాజీనామాలతో ఖాళీ అయిన మరో 15 ఉపసర్పంచి స్థానాలకూ మే 5న ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణంగానైనా వాయిదాపడితే 6న ఇక్కడ మళ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలి.

ఇదీ చదవండి:ACB: నెల్లూరు కార్పొరేషన్​లో రూ. 6.50కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి

ABOUT THE AUTHOR

...view details