కృష్ణాజిల్లా పామర్రులో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైంది. కంచర్ల రామారావు జిల్లా పరిషత్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనం బారులు తీరారు. పోలింగ్ కేంద్రంలోని 8వ వార్డు దగ్గర ఓటు వేసేందుకు వెళ్లేవారికీ.. బయటికి వచ్చే వాళ్లకీ ఒకేదారి అవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే వృద్ధులు, వికలాంగులు సహాయకులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈ మండలాల పరిధిలో 49 గ్రామ పంచాయతీలు, 422 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన గుడ్లవల్లేరులోని అంగలూరును అడిషనల్ ఎస్పీ మలిక గర్గ్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహణ, శానిటైజేషన్, గ్రామంలో ఓటర్ల సంఖ్య తదితర వివరాలు.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.
గుడివాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. వయసు మళ్లిన, నిలబడలేని స్థితిలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొండూరు పోలింగ్ కేంద్రంలో వృద్ధులను.. పోలీస్ సిబ్బంది తమ చేతులపై మోసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చేస్తున్నారు.
జిల్లాలోని నిమ్మకూరు పోలింగ్ కేంద్రంలో వివాదం తలెత్తింది. ఓటరుకి సహాయకుడిని పంపే విషయంలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య వివాదం తలెత్తింది. రెండు వర్గాలు ఘర్షణకు దిగే ప్రయత్నం చేయటంతో పోలీసులు అడ్డుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవాలు:
జిల్లాలో రెండో దశ పోలింగ్‌కు సంబంధించి మొత్తం 211 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 36 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 175 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
ఏకగ్రీవమైన 36 గ్రామ పంచాయతీలు మండలాల వారీగా..
గుడివాడ : దొండపాడు, నుజెళ్లా, సేరి వేల్పూరు, సైదేపూడి.