స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు(MLC Nominations) దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) ప్రకటించింది. వైకాపా తరఫున 8 జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో 11 నామినేషన్లు దాఖలు అయినట్టు వెల్లడించింది. అనంతపురం నుంచి వై.శివరామి రెడ్డి, కృష్ణా జిల్లాలో మొండితోక అరుణ్ కుమార్, తలసిల రఘురాం, ధూళిపాల శ్రీకాంత్‌లు నామినేషన్లు వేశారు. తూర్పు గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి నామినేషన్లు దాఖలు కాలేదని ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు. విజయనగరం నుంచి ఇందుకురి రఘురాజు, విశాఖ జిల్లా నుంచి రెండు సీట్లకు గాను వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావులు, ప్రకాశం జిల్లా నుంచి తూమటి మాధవరావు వైకాపా అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు.
MLC Nominations: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు - ఎమ్మెల్సీ ఎన్నికల వార్తలు
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలైనట్లు ఎస్ఈసీ(SEC) వెల్లడించింది. వైకాపా తరఫున 8 జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో 11 నామినేషన్లు దాఖలు అయినట్టు తెలిపింది. తూర్పు గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి నామినేషన్లు దాఖలు కాలేదని ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు
కె.విజయానంద్