విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మందు బాబులు హల్ చల్ సృష్టించారు. మద్యం మత్తులో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ వైద్యం చేసే సమయంలో గాయపడిన యువకుల తరుఫు వ్యక్తులు ప్రభుత్వ జూనియర్ డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించారు. యువకుల కోసం రంగంలోకి దిగిన కృష్ణలంకకు చెందిన వైకాపా మాజీ కార్పొరేటర్, అతని అనుచరులు వైద్యులపై దాడికి యత్నించారు. మాచవరం పోలీస్టేషన్లో ఇరువర్గాల వారు కేసులు పెట్టుకున్నారు. పోలీసులు సర్దిచెప్పటంపై కేసును వెనక్కి తీసుకున్నారు.
మద్యం మత్తులో వైద్యులపై దాడి - మందుబాబుల దాడి
మద్యం తాగి ప్రమాదం కొని తెచ్చుకుని ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం వైద్యులు రాగా.. అప్పటికే మైకంలో ఉన్న మందుబాబులు.. వైద్యులపై దురుసుగా ప్రవర్తించి దాడికి దిగారు.

వైద్యులపై దాడి