ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థుల ఆందోళన - protest on road damage news

రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అగ్రహారం ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

The protest of the villagers
గ్రామస్థుల ఆందోళన

By

Published : Dec 11, 2020, 1:25 PM IST

రహదారి పరిస్థితి మెరుగుపరచాలని కృష్ణాజిల్లా అగ్రహారం గ్రామస్థులు ఆందోళన చేశారు. జగ్గయ్యపేట - ముక్త్యాల రహదారిలో తిరిగే భారీ వాహనాల వల్ల ధ్వంసమైన రోడ్లపై మోకాలిలోతు గుంతలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details