ఆరు, ఏడు నెలలుగా జీతాలు అందక పోవడంతో ఆందోళన బాట సిద్ధమైన ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో జరిగింది. ఆశా వర్కర్లు తమకు జీతాలివ్వండి మహాప్రభో అంటూ శాంతియుతంగా చేసే ఆందోళన కార్యక్రమంలో భాగంగా విజయవాడ బయలుదేరారు. అది తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. 7 నెలలుగా ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించండని అడిగినందుకు అరెస్ట్ చేయడం చాలా దారుణమని ఆవేదన చెందుతున్నారు ఆశా వర్కర్లు. పోలీసుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
జీతాల కోసం ఆశా వర్కర్ల ఆందోళన... అరెస్టు చేసిన పోలీసులు...
ఏడు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు.. తమ కుటుంబాలు ఎలా గడుస్తాయంటూ ప్రభుత్వాన్ని శాంతియుతంగా అడుగుదామని ఆశా వర్కర్లు బయల్దేరారు. కానీ మార్గ మధ్యలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆశ వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
TAGGED:
krishna district