లాక్ డౌన్ నేపథ్యంలో కృష్ణా జిల్లా నందిగామలో నిరుపేదలకు స్థానిక పోలీసులు 10 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని.. ఇంట్లోనే ఉండి తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పేదలకు నిత్యావసరాలు అందజేసిన పోలీసులు - lockdown effect on people
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ సమయంలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఉపాధి కోల్పోయిన ప్రజలకు పోలీసులు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు.

పేదలకు నిత్యావసరాలు అందజేసిన పోలీసులు