ప్రభుత్వానికి పోలీసులు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని తెదేపా సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ అంశంలో సీనియర్ న్యాయవాదిపై కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. కోర్టులో తేల్చుకోవాల్సిన సివిల్ వివాదాల్లో పోలీసుల ప్రమేయం ఏమిటని నిలదీశారు.
పూటకో దారుణం.. రోజుకో దాడి
రాష్ట్రంలో దళితులపై పూటకొక దారుణం, రోజుకొక దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, డిక్లరేషన్లో సంతకాలు పెట్టకపోయినా చర్యలు తీసుకోకపోవడాన్ని ఉమ ఖండించారు.